Fri Mar 20 2026 20:00:30 GMT+0530 (India Standard Time)
నేడు ఉత్తరాంధ్రకు జగన్
వైఎస్ జగన్ నేడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేనయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం గ్రీన్ఫోల్డ్ ఎయిర్‌పోర్టును 3,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2,200 ఎకరాలను సేకరించింది. శంకుస్థాపన చేసిన అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
విశాఖ టెక్ పార్క్‌కు..
అక్కడి నుంచి విశాఖకు బయలుదేరి వెళతారు. అక్కడ విశాఖ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అదానీ సంస్థ 14,634 కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని నిర్మించనుంది. దీంతో పాటుగా తారకరామ తీర్థ సాగరం పనులకు కూడా జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తు ఏర్పాు చేశారు
Next Story

