Mon Dec 08 2025 06:51:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ తో జగన్ భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కు సమాచారం అందింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ ను జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్దలు ఇచ్చిన హామీలను కూడా గవర్నర్ కు జగన్ వివరించనున్నారు. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి కూడా గవర్నర్ కు తెలపనున్నారు.
మంత్రి వర్గ విస్తరణ.....
ఇక ఈనెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంది. దీనిపై ప్రత్యేకంగా జగన్ గవర్నర్ తో మాట్లాడనున్నారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయించాలా? లేక మరేదైనా ఓపెన్ ప్లేస్ లో చేయించాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా, దీనిపై గవర్నర్ తో జగన్ చర్చిస్తారని చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.
Next Story

