Thu Mar 19 2026 18:23:54 GMT+0530 (India Standard Time)
నేడు తూ.గో జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి సమీపంలోని హెలీప్యాడ్ కు వెళ్లి.. హెలికాప్టప్ ద్వారా ..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి సమీపంలోని హెలీప్యాడ్ కు వెళ్లి.. హెలికాప్టప్ ద్వారా గోపవరానికి బయల్దేరుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుమ్మళ్లదొడ్డి గ్రామంకు వెళ్లి.. అక్కడ అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.
Next Story

