Wed Feb 04 2026 00:19:20 GMT+0000 (Coordinated Universal Time)
రేపు పోలవరంలో సీఎం జగన్ పర్యటన
ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు లోయర్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. రేపు (జూన్ 6) పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను జగన్ పరిశీలించనున్నారు. అలాగే స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ప్రాంతాలను జగన్ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.
పోలవరం సందర్శన అనంతరం ప్రాజెక్టు వద్ద జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో శనివారం పోలవరంను జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Next Story

