Thu Dec 05 2024 16:22:47 GMT+0000 (Coordinated Universal Time)
నిడదవోలులో తేల్చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ కార్యక్రమంలో ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై మొదటిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని.. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్‌మనీ పంచుతూ పట్టుబడ్డారని అన్నారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిందని, కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు.
ఫేక్ అగ్రిమెంట్‌తో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి బాబు స్కాం చేశారన్నారు సీఎం జగన్. అధికారులు వద్దంటున్నా ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కెంపీలకు ఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్‌లను ఐటీశాఖ బయటపెట్టిందని అన్నారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపిందన్నారు. ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడన్నారు జగన్.
Next Story