Sun Mar 15 2026 18:23:23 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతికి సీఎం జగన్ !
ఉదయం 9.30 గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్..

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రమైన తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 11.20 గంటలకు ఎస్ వీ యూనివర్శిటీ స్టేడియంకు చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.55 గంటలకు టిటిడి నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. టాటా కేన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

