Sun Mar 15 2026 15:05:22 GMT+0530 (India Standard Time)
రేపు ఒంగోలులో పర్యటించనున్న సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం..

తాడేపల్లి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయల్దేరి 10.10 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోనున్న ఏబీఎం గ్రౌండ్ కు చేరుకుంటారు.
అనంతరం పట్టణంలోని పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
Next Story

