Sun Mar 15 2026 11:55:23 GMT+0530 (India Standard Time)
నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. తొలుత పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్ లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసిప్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసంలో ఆయన బయలుదేరి ఉదయం 9.25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడుకు చేరుకుంటారు.
గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో జగన్ పాల్గొంటారు. అనంతరం జగన్ మెడికల్ కళాశాల 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నానికి గుంటూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

