Mon Jan 20 2025 05:54:16 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వచ్చే నెలలో సీఎం జగన్ దావోస్ కు వెళ్లనున్నారు. మే 22న సీఎం దావోస్ కు వెళ్లి..
అమరావతి : సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వచ్చే నెలలో సీఎం జగన్ దావోస్ కు వెళ్లనున్నారు. మే 22న సీఎం దావోస్ కు వెళ్లి.. వారంరోజుల పాటు పర్యటించనున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో జగన్ పాల్గొంటారు. ఈ మేరకు జగన్ కు ఆహ్వానం కూడా అందింది.
గతేడాది డిసెంబర్ లోనే ఈ సమ్మిట్ జరగాల్సి ఉండగా.. కరోనా - ఒమిక్రాన్ ల విజృంభణతో సమ్మిట్ నిర్వహణ వాయిదా పడింది. రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ గానే జరిగాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ప్రత్యక్షంగా జరగనుంది.
Next Story