Fri Dec 05 2025 22:45:38 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్ర ప్రజలకు శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్
అలాగే సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని..

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ.. అన్నీ శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు.
అలాగే సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆశించారు. ప్రతిఒక్కరూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.
Next Story

