Sat Apr 01 2023 22:50:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి : సీఎం జగన్
మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను పేర్కొంటూ.. వాటికి వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో భారీ ..

ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఎక్సైజ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదన్నారు. అక్రమ మద్యం, గంజాయి సాగుని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు పోలీసు, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను పేర్కొంటూ.. వాటికి వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలని వివరించారు. యువత మత్తుపదార్థాలు బానిసలు కాకుండా చూడాలన్నారు. అక్రమంగా డ్రగ్స్, గంజాయిని సరఫరా చేసే ముఠా, వ్యక్తులపై దృష్టిసారించాలన్నారు. అలాగే ఎస్ఈబీ ట్రోల్ ఫ్రీ నంబరును ప్రచారం చేయాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. మహిళలు, యువతులు, ఆడపిల్లల సంరక్షణకై దిశ యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
Next Story