Sun Mar 15 2026 09:16:33 GMT+0530 (India Standard Time)
ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. తల్లితో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.
లోటస్ పాండ్ కు:
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలోనే ఆయన భోజనం చేశారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు.
Next Story

