Thu Mar 19 2026 21:31:21 GMT+0530 (India Standard Time)
సీఎం జగన్ కడప జిల్లా పర్యటన రద్దు
అందుకు ప్రధాన కారణం పొగమంచు కావడం గమనార్హం. నిజానికి ఈ రోజు సీఎం జగన్ అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దైంది. అందుకు ప్రధాన కారణం పొగమంచు కావడం గమనార్హం. నిజానికి ఈ రోజు సీఎం జగన్ అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ..
కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు దట్టంగా ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చాలాసేపు వేచి చూసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం జగన్ ఆఖరి నిమిషంలో తన కడప పర్యటనను రద్దు చేసుకున్నారు.
Next Story

