Fri Jan 17 2025 07:59:18 GMT+0000 (Coordinated Universal Time)
బైజూస్ తో ఏపీ సర్కార్ ఎంఓయూ
ముఖ్యమంత్రి జగన్ బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ బైజూస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు.
ముఖ్యమంత్రి జగన్ బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బైజూస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు. 24 వేల రూపాయలు చెల్లిస్తే కాని బైజూస్ తన సబ్జెక్ట్ లను పిల్లలకు ఇవ్వదు. అలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్యాంశాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. బైజూస్ చీఫ్ రవీంద్రన్ తో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అందులో భాగంగనానే ఇ-లెర్నింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ట్యాబ్స్ అంద చేయడం కోసం....
4,70 లక్షల మందికి ట్యాబ్స్ అందచేస్తామని జగన్ తెలిపారు. ఈ సెప్టంబరులోనే ట్యాబ్ లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ట రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొందరికే పరిమితమైన ఎడ్యుటెక్ విద్య అందరికీ లభ్యమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంతరి జగన్ తెలిపారు. ప్రతి ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందచేస్తామని తెలిపారు.
Next Story