Sat Mar 07 2026 15:14:37 GMT+0530 (India Standard Time)
Breaking : ఏపీ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయివేటు గోదాములను అద్దెకు తీసుకోవద్దని నిర్ణయించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు జరుగుతున్నది ప్రయివేటు గోదాముల నుంచే అని గుర్తించిన పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
గిడ్డంగుల నిర్వహణ సంస్థ...
కేవలం గిడ్డంగుల నిర్వహణ సంస్థల అధీనంలో మాత్రమే రేషన్ బియ్యం ఉంచాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అద్దెకు ఇకపై గోదాములు తీసుకోకుండా గిడ్డంగుల నిర్వహణ సంస్థకు మాత్రమే అప్పగించాలని తెలిపింది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి కావడంతో పాటు మచిలీపట్నం గోదాములో బియ్యం మాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

