Sun Dec 14 2025 01:55:29 GMT+0000 (Coordinated Universal Time)
CPI : మాజీ సీజే వెంకటరమణ, వెంకయ్యనాయుడులపై నారాయణ సంచలన కామెంట్స్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. మొట్టమొదటగా రాజకీయాలను డబ్బు తో నడిపించింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. చంద్రబాబు నాయుడు బతుకు తెరువు రాజకీయాల కోసమే మోడీ తో చేతులు కలిపారన్న నారాయణ 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయని అన్నారు.
న్యాయవ్యవస్థను...
న్యాయవ్యవస్థ ను, తెలుగు ప్రజలను నాశనం చేసింది మాజీ సీజే వెంకటరమణ, వెంకయ్యనాయుడే నంటూ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కన్నయ్య పై దాడులు చేరన్న నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని, .కేంద్రంతో బీజేపీ ఓడిపోతుందని, ఏపీ లో ప్రభుత్వం మారుతుందని చెప్పారు. ప్రస్తుతం ముస్లిం లు బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనేనని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story

