Wed Jan 28 2026 23:50:46 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఆయనపై నమోదయిన కేసులో నవంబరు 6వ తేదీ వరకూ తదుపరి చర్యలు తీసుకోకూడదని తెలిపింది. నవంబరు 6వ తేదీన తుది తీర్పును తాము ఇస్తామని అప్పటి వరకూ ఈ కేసులో అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవదన్దని సూచించింది.
నవంబరు 6వ తేదీన ...
నవంబరు 6వ తేదీన తుది తీర్పునకు సంబంధించిన ఉత్తర్వులు వెల్లడిస్తామని పేర్కొంది. నంద్యాల సభలో ఎన్నికల కోడ్ ను అల్లు అర్జున్ ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిని క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ను ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు దీనిపై విచారణ జరిపి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
Next Story

