Thu Mar 19 2026 10:28:01 GMT+0530 (India Standard Time)
అంబటిపై నాగబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై నాగబాబు ట్వీట్ చేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై నాగబాబు ట్వీట్ చేశారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ పై ఆయన కామెంట్ చేశారు. సంబరాల రాంబాబూ మీ డ్యాన్స్ బాగుందని అన్నారు. ఆ మాట అంటూనే పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నాగబాబు ఎద్దేవా చేశారు.
డ్యాన్స్ బాగుందంటూనే...
అంబటి రాంబాబు నిన్న సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు చేసిన బంజారా డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు నాగబాబు సెటైర్ వేశారు. డ్యాన్స్ బాగుందంటూనే.. పోలవరం పూర్తి చేయాల్సిందన్నారు.
Next Story

