Fri Dec 05 2025 14:01:11 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణకు నాగబాబు కౌంటర్
సీపీఐ నేత నారాయణకు సినీ నటుడు నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

సీపీఐ నేత నారాయణకు సినీ నటుడు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నారాయణకు అన్నం తినిపించండంటూ జనసైనికులకు ఆయన పిలుపు నిచ్చారు. గడ్డి, చెత్తా చెదారం తింటున్న నారాయణకు అన్నం తినిపించడంంటూ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సీపీఐ నేత నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడని నాగబాబు ట్వీట్ చేశారు.
చిరంజీవిని అన్నారని....
నాగబాబు కోపానికి అసలు కారణం.. తన అన్న చిరంజీవిపై నారాయణ పరుష పదాలతో విమర్శలు చేయడమే. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కృష్ణ లాంటి వారిని కాకుండా చిల్లరగాళ్లైన చిరంజీవిని పిలిచారంటూ నారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పై కూడా నారాయణ విమర్శలు చేయడంతో నాగబాబు ట్విట్టర్ లో నారాయణపై ఈ విధంగా స్పందించారు.
Next Story

