Sun Mar 15 2026 18:19:55 GMT+0530 (India Standard Time)
మోహాన్ బాబు సంచలన వ్యాఖ్యలు
సినీ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

సినీ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాను బీజేపీ మనిషినని అన్నారు. తాను రియల్ హీరోని అని మోహన్ బాబు చెప్పారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లల్లో తాను ఒకడినని మోహన్ బాబు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాల్సిందేనని ఆయన అన్నారు. విద్యార్థుల కోసం తాను పోరాడితే అక్రమ కేసులు పెట్టారన్నారు మోహన్ బాబు.
పాదయాత్రగా కోర్టుకు...
ఈరోజు తిరుపతి కోర్టుకు మోహన్ బాబు హాజరవుతున్నారు. ఆయన శ్రీవిద్యానికేతన్ నుంచి పాదయాత్రగా ఆయన కోర్టుకు బయలుదేరి వెళ్లారు. 2019 లో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మోహన్ బాబు ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో మోహన్ బాబుపై కేసు నమోదయింది. ఈ కేసు విషయంలో హాజరయ్యేందుకు మోహాన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్ కూడా వచ్చారు.
Next Story

