Wed Dec 17 2025 06:44:37 GMT+0000 (Coordinated Universal Time)
Ali : ఇక రాజకీయాల జోలికి రాను.. సినిమాలకే పరిమితమవుతా
సీనీ నటుడు ఆలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు.

సీనీ నటుడు ఆలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆలీ మొన్నటి ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమిపాలు కావడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఆలి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు. రెండేళ్ల పాటు పదవిలో ఉన్న ఆలీ ప్రభుత్వం మారిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా చేసి...
ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక తాను సినిమాలకే పరిమితమవుతానని ఆయన ప్రకటించారు. తాను ఇరవై ఏళ్ల పాటు టీడీపీలోనే కొనసాగానని, 2019 లోనే తాన వైసీపీలో చేరినట్లు ఆయన వీడియోలో తెలిపారు. సినిమాలు, టీవీలపైనే తన ఫోకస్ పెడతానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆలీ ప్రకటించారు. అయితే అధికారంలోఉన్నప్పుడు పదవులు అనుభవించి పోగానే పార్టీని వీడటంపై ఆలీపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పు పడుతున్నారు.
Next Story

