Sat Mar 07 2026 21:57:11 GMT+0530 (India Standard Time)
మార్గదర్శిపై మళ్లీ దాడులు
ఏపీ వ్యాప్తంగా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, అధికారుల ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఏపీ సీఐడీ అధికారులు...
నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో ఏకకాలంలో ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా సోదాలు జరిపారు. అప్పట్లో మార్గదర్శి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా మరోసారి దాడులు జరుగుతున్నాయి.
Next Story

