Fri Mar 20 2026 13:30:06 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేత చల్లాబాబుపై రాళ్లదాడి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి చల్లా బాబుపై రాళ్ల దాడి జరిగింది.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి చల్లా బాబుపై రాళ్ల దాడి జరిగింది. ఇదేమి ఖర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వాహనాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. సోమల మండలం నజంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిపారు. పరస్పరం రాళ్ల దాడి జరుపుకోవడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.
ఇదేమి ఖర్మ కార్యక్రమంలో..
చల్లా బాబు కారుపై రాళ్ల దాడి జరగడంతో ఆయన కారుతో పాటు అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగానే ఉంది. రెండు వర్గాలను చెదరగొట్టినా పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. పరిస్థిితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.
Next Story

