Sat Mar 07 2026 21:01:27 GMT+0530 (India Standard Time)
నదిలో కొట్టుకుపోయిన రెండతస్థుల భవనం
చిత్తూరు జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. నదులు పొంగుతున్నాయి. నదులు నగారన్ని చుట్టిముట్టేస్తున్నాయి

చిత్తూరు జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. నదులు పొంగుతున్నాయి. నదులు నగారన్ని చుట్టిముట్టేస్తున్నాయి. దీంతో తిరుచానూరులోని రెండతస్థుల భవనం నదిలో కొట్టుకుపోయింది. కూలిపోయిన దృశ్యాలను మొబైల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. తిరుపతి నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది.
వరద నీటితో....
తిరుపతి నగరం ఎప్పుడూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కళకళ లాడేది. కానీ వరదల దెబ్బకు కళావిహీనంగా మారింది. ప్రమాదకరమైన భవనాలను గుర్తించి అధికారులు వాటిని ఖాళీ చేయిస్తున్నారు. అందులో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తుంది. ఇళ్లలోకి చేరిన నీటిని మోటార్లతో తోడి బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది.
Next Story

