Wed Dec 06 2023 10:14:13 GMT+0000 (Coordinated Universal Time)
భీమవరానికి చిరంజీవి
భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకానున్నారు.

భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకానున్నారు. చిరంజీవి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సంధర్భంగా చిరంజీవిని అభిమానులు పూల దండలతో ముంచెత్తారు. చిరంజీవిని చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మోదీ సభలో...
కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందచేశారు. దీంతో చిరంజీవి రాజమండ్రికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరం బయలుదేరి వెళతారు.
Next Story