Mon Mar 16 2026 16:02:44 GMT+0530 (India Standard Time)
అదంతా అబద్ధం... ప్రచారం మాత్రమే
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్లు చిరంజీవి ప్రకటించారు. రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్లు చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగిన తనకు రాజ్యసభ పదవి ఎవరు ఇస్తారని చిరంజీవి ప్రశ్నించారు. కావాలని కొందరు ఈ విషయాన్ని ప్రచారం చేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుందన్నారు.
సినిమా అంశాలే...
తాను సినిమా ప్రతినిధిగా ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లానని చిరంజీవి చెప్పారు. తమ మధ్య సినిమా సంబంధ విషయాలు తప్ప రాజకీయ అంశాలేవీ రాలేదని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలను జగన్ కు చెప్పానని, ఆయన విన్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.
Next Story

