Sun Mar 15 2026 08:54:40 GMT+0530 (India Standard Time)
TDP : చింతమనేనికి లైన్ క్లియర్
చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయింది. ఆయనకు బీఫారం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చేశారు

చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయింది. ఆయనకు బీఫారం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చేశారు. చింతమనేని ప్రభాకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో ఆయనకే టిక్కెట్ అని కన్ఫర్మ్ అయింది. అనపర్తి సీటును టీడీపీ తీసుకుంటే, దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది.
బీఫారం కోసం...
దీంతో చింతమనేని ప్రభాకర్ కు బీఫారం వస్తుందా? లేదా? అన్న టెన్షన్ పట్టుకుంది. ఆయన మామూలుగానే నామినేషన్ వేశారు. అయితే బీఫామ్ ఇస్తారా? లేదా? అన్న సందేహాలకు నేడు తెరపడింది. బీఫామ్ తీసుకునేందుకు రావాలని చంద్రబాబు ఫోన్ చేయడంతో చింతమనేని ప్రభాకర్ శ్రీకాకుళం బయల్దేరి వెళ్లారు. శ్రీకాకుళంలో చింతమనేని ప్రభాకర్ మధ్యాహ్నం చంద్రబాబు నుంచి బీఫామ్ అందుకోనున్నారు.
Next Story

