Fri Dec 05 2025 14:54:44 GMT+0000 (Coordinated Universal Time)
TDP : పేట టీడీపీ లో "లావు" వేలు... టీడీపీకి కష్టాలు మొదలు
మర్రి రాజశేఖర్ చేరికతో తెలుగుదేశం పార్టీ నేతలు చిలకలూరిపేటలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి

తెలుగుదేశం పార్టీలో చేరికలు ఆ పార్టీని నియోజకవర్గంలో ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. మర్రి రాజశేఖర్ చేరికతో తెలుగుదేశం పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ టీడీపీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రత్తిపాటి పుల్లారావు బలమైన నేతగా ఉన్నారు. మర్రి రాజశేఖర్ నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్, వైసీపీలో ఉండి ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా కొన్నిసార్లు పోటీ చేశారు. కొన్ని సార్లు వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన ఓటమికి కూడా కారణమయ్యారు. దీంతో ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఆయన వర్గీయులు మర్రి రాజశేఖర్ ను తమ ప్రత్యర్థిగానే భావిస్తుంది. అయితే నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయులకు మర్రి రాజశేఖర్ వైసీపీలో మంచి మిత్రుడిగా ఉండేవారు.
తనకు సన్నిహితుడైన...
లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి తిరిగి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అధినాయకత్వానికి కూడా దగ్గరయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలు సూచనతోనే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత మర్రి రాజశేఖర్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా తిరిగి ఎమ్మెల్సీ పదవిని మర్రి రాజశేఖర్ కు ఇస్తామన్న ఒప్పందం కుదిరింది. అదే ఇప్పుడు చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ మంటలు పుట్టిస్తుంది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ అయితే చిలకలూరి పేట నియోజకవర్గంలో మళ్లీ మర్రి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశముందన్న అనుమానం ప్రత్తిపాటి వర్గీయుల్లో నెలకొంది.
రాజీనామాల బాటలో...?
ఇన్నాళ్లూ రాజీనామా చేసి మౌనంగా ఉన్న మర్రి రాజశేఖర్ మాత్రం టీడీపీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కండువా కప్పారు. దీని వెనక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమేయం ఉందని అనుమానించి పేట టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ఎంపీ తీరును ఎండగడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పార్టీలో లావు వేలు పెట్టి చిచ్చుపెట్టారంటున్నారు. చిలకలూరి పేటలోని నాలుగు మండలాల్లో టీడీపీ నేతలు రాజీనామా చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు కూడా రాజీమాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఎమ్మెల్యే ప్రతిప్తాటి వర్గానికి చెందిన వారే కావడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి పేట తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని అధినాయకత్వం ఎలా చల్లారుస్తుందో చూడాలి.
Next Story

