Sat Dec 06 2025 09:03:32 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో చర్చ
రాజధాని విషయంపై చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు

రానున్న అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని విషయంపై చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే న్యాయ, శాసన వ్యవస్థల పరిధులపై చర్చ జరగాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చట్టాలు చేసే అధికారం శాసనససభకు లేదని హైకోర్టు వ్యాఖ్యానించడంపై వచ్చే అసెంబ్లీ లో చర్చించాల్సి ఉందని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ధర్మాన లేఖపై....
సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అసెంబ్లీ, న్యాయ, కార్యనిర్వాహక పరిధిపై చర్చ జరగాలని సభ్యులు కోరుకుంటున్నారని తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చకు వైసీపీ సిద్ధమవుతుంది. హైకోర్టు తీర్పుపై చర్చ జరగాలని ఇప్పటికే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. దీనిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Next Story

