Fri Dec 05 2025 23:49:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంను కించపర్చేలా మాట్లాడితే ఊరుకోం
ముఖ్యమంత్రిని కించపర్చేలా మాట్లాడటం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు

ముఖ్యమంత్రిని కించపర్చేలా మాట్లాడటం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వం జీతాలను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. రాజకీయ పార్టీల ట్రాప్ లో పడకుండా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
సహకరించాలి....
ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమేనని గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమభావనతో చూస్తుందన్నారు. ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రం బాగుండటం చంద్రబాబుకు ఇష్టం లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story

