Thu Dec 18 2025 10:06:49 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు

సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పై ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.
ఈ నెల 23వ తేదీన...
రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23న జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకు వరకూ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, సోషల్మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లను ఆదేశించారు.
Next Story

