Wed Mar 25 2026 11:05:56 GMT+0530 (India Standard Time)
నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు

నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లు నేడు గుంటూరుకు రానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి ఇరువురూ హాజరు కానున్నారు.
వివాహ వేడుకకు...
ఈ వివాహ వేడుకకు సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి హాజరుకానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ లో ఉండగా ఉన్న అనుబంధంతో ఆయన వస్తుండగా, తన పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి చంద్రబాబు హాజరవుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
Next Story

