Sun Mar 15 2026 10:54:39 GMT+0530 (India Standard Time)
అబద్దపు ప్రచారానికి తెర.. జగన్ కుటుంబంతో కలసి
పులివెందుల చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పులివెందుల చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను జగన్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పులివెందుల చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. జగన్ తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
విభేదాలంటూ....
జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు కుటుంబ సభ్యులంతా కలసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్, విజయమ్మ వేర్వేరుగా ఇడుపుల పాయ ఘాట్ వద్ద నివాళులర్పించారని, వారి మధ్య విభేదాలు తలెత్తాయిని ప్రచారం ఒక వర్గం మీడియా జోరుగా చేసింది. ఆ ప్రచారం అంతా ఒట్టిదేనని కొట్టి పారేశారు. కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రం జగన్ తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story

