Wed Dec 17 2025 14:15:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్దయెత్తున కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను కట్ చేసి కార్యకర్తలతో కలసి మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకను జరపపున్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేయనున్నారు.
రక్తదానాలు.. అన్నదానాలు...
ఇందుకోసం వందల కేజీల కేక్ లను ముందుగానే ఆర్డర్ ఇచ్చిన వైసీపీ నేతలు భారీ ఎత్తున జగన్ పుట్టిన రోజు వేడుకలను జరపాలని నిర్ణయించారు. అనేక చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆసుపత్రిలోని రోగులకు నేతలు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జరిపేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు.
Next Story

