Sat Mar 21 2026 23:58:52 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు జగన్ చేరుకుంటారు. 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవకు చేరుకుని అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు...
అనంతరం 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. . వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలను కూడా ప్రారంభిస్తారు. . ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు
Next Story

