Sun Mar 22 2026 04:54:06 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వాహనమిత్ర లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వాహనమిత్ర లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. వరసగా నాలుగో ఏడాది వాహనమిత్ర పథకాన్ని జగన్ లబ్దిదారులకు అందివ్వనున్నారు. ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వాహనమిత్ర పధకం కింద 2,61,516 మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 261.52 కోట్ల రూపాయలను కేటాయించనుంది.
వాహనమిత్ర పథకం కింద....
విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జగన్ పది వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం వాహనమిత్ర పధకం కింద 1,026 కోట్ల రూపాయలను అందించింది. ఒక్కొక్కరికి నలభై వేల రూపాయల సాయం చేసింది. ఈరోజు జగన్ విశాఖ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

