Sun Mar 15 2026 15:43:09 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు రెండు జిల్లాలకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల, కడప జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన నంద్యాల, కడప జిల్లాల్లో పర్యటించనున్నారని ముఖ్యమంత్రి వర్గాలు వెల్లడించాయి. నంద్యాల జిల్లాలో అవుకు రెండో టన్నెల్ ను జగన్ జాతికి అంకితం చేయనున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి వెల్లి అక్కడ అవుకు రెండో టన్నెల్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. రెండో టన్నెల్ ను జాతికి అంకితం చేయనున్నారు.
కడప పెద్ద దర్గాకు...
గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా 567 కోట్ల రూపాయలతో నిర్మించిన టన్నెల్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. కడప పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయనన పాల్గొననున్నారు. సాయంత్రం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా రెండు జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

