Thu Feb 05 2026 06:03:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు రెండు జిల్లాలకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తుఫాను కు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ఈరోజు తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తొలుత తిరుపతిజిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం చేరుకుంటారు. అక్కడ స్వర్ణముఖనదికి కట్ట తెగిపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.
తుఫాను బాధితులను...
అనంతరం బాపట్ల జిల్లా మరుపోప్రోలువారిపాలెం జగన్ వెళతారు. అక్కడ పంట నష్టాన్ని పరిశీలిస్తారు. స్వయంగా రైతులతో ఆయన మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారు. తర్వాత కర్లపాలెం పాతసందాయపాలెం చేరుకుని తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. రైతులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. నష్టం వివరాలను తెలుసుకుని అక్కడికక్కడే సాయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
Next Story
