Thu Mar 19 2026 04:33:28 GMT+0530 (India Standard Time)
నేడు తిరువూరుకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరువూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరువూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. నిజానికి ఈ నెల 18వ తేదీన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈరోజు ఉదయం పది గంటలకు తిరువూరుకు జగన్ బయలుదేరుతారు.
జగనన్న విద్యా దీవెన...
జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

