Tue Mar 17 2026 07:10:50 GMT+0530 (India Standard Time)
రేపు ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభం
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల ఆయన పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి జగన్ రేపు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో జనసమీకరణకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ సొంత నియోజకవర్గంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.
బహిరంగ సభలో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్ని పరిశీలిస్తారు. అనంతరం సమీపంలోని ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ స్టాళ్ళను కూడా జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత కావూరు గ్రామంలో సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

