Tue Mar 17 2026 06:05:07 GMT+0530 (India Standard Time)
నెల్లూరుకు నేడు జగన్
ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొననున్నారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈరోజు నెల్లూరులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
జిల్లా నేతలతో....
ఇక ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా నేతలతో జగన్ కాసేపు మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు వెళతారు.
Next Story

