Sun Apr 27 2025 03:48:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కావలికి జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలిలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలి నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా చుక్కల భూములకు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
చుక్కుల భూముల...
దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన 206.171 ఎకరాల భూమని రైతులకు కల్పించనున్నారు. ఈరోజు ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలికి జగన్ చేరుకుంటారు. అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చుక్కల భూములపై రైతులకు హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం తిరిగి సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story