Mon Mar 16 2026 04:25:18 GMT+0530 (India Standard Time)
రేపు ఆదోనికి జగన్
ముఖ్యమంత్రి జగన్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముఖ్యమంత్రి జగన్ కర్నూలుకు బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆదోని చేరుకోనున్నారు.
జగనన్న కిట్ల పంపిణీ...
ఆదోని మున్సిపల్ హైస్కూలును పరిశీలించిన అనంతరం అక్కడ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం జగనన్న విద్యా కిట్ల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఆదోని నుంచి బయలుదేరి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story

