Thu Jan 29 2026 19:53:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్నూలు జిల్లాకు జగన్
ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదోనిలో ఆయన జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదోనిలో ఆయన జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆదోని చేరుకుంటారు. అక్కడ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తొలిసారి ఆదోనికి...
జగన్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అధికారులతో పాటు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తొలిసారి ఆదోనికి జగన్ వస్తుండటంతో భారీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణను చేస్తున్నారు.
Next Story

