Sun Mar 15 2026 07:41:00 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నల్లపాడు వద్ద ఫ్లెక్సీ కలకలం.. జగన్ వస్తున్నప్పుడే ఇలా
ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఆ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఆ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. గుంటూరు జిల్లా నల్లపాడులో ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ రాక కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
భూమిని కాపాడాలంటూ...
అయితే నల్లపాడులో జగన్ రాక సందర్భంగా వెలిసిన ఒక ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. నల్లపాడు గ్రామంలో వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న పోరంబోకు భూమిని కాపాడాలంటూ అచ్చిరెడ్డి అనే వ్యక్తి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వే నెంబరు 543, 546, 550లలో గల పోరంబోకు భూమిని కాపాడన్నా అంటూ చల్లా అచ్చిరెడ్డి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే జగన్ వచ్చే ముందే పోలీసులు చూసి ఈ ఫ్లెక్సీని తొలిగించడం విశేషం.
Next Story

