Thu Mar 19 2026 15:05:04 GMT+0530 (India Standard Time)
ఉగాది వేడుకల్లో నేడు జగన్ దంపతులు
ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు

ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. ఉదయం 10.36 గంటలకు పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా పాల్గొననున్నారు. ఉగాది వేడుకల కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
అందరూ బాగుండాలి...
శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా క్షేమంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరారు. పంటలు బాగా పండి రైతులు శుభిక్షంగా ఉండాలని జగన్ కోరుకున్నారు.
Next Story

