Thu Dec 11 2025 04:19:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ తో జగన్ భేటీ
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు.

నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు జగన్ రాజ్ భవన్ కు రానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించనున్నారు. జిల్లాల ఏర్పాటు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జగన్ వివరించనున్నారు.
మంత్రి వర్గ విస్తరణపై....
దీంతో పాటు జగన్ త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణపై కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో చర్చించనున్నారు. ఈ నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలుండటంతో జగన్ గవర్నర్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై కూడా జగన్ గవర్నర్ తో చర్చించే అవకాశముంది.
Next Story

