Thu Mar 26 2026 15:33:49 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి జగన్.. అమిత్ షాను కూడా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం అమిత్ షాను కలిసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలోని పెద్దలను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై జగన్ చర్చించనున్నారు.
రేపు కూడా......
ముఖ్యమంత్రి జగన్ రేపు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం లేకపోలేదు. కొందరు కేంద్ర మంత్రులను కలసే అవకాశముందని చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలపై జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశముంది.
Next Story

