Tue Feb 03 2026 06:57:26 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాలో
ఆంధ్రప్రదేశ్ రైతులకు నేడు మరో శుభవార్త ముఖ్యమంత్రి జగన్ చెప్పనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను జమ చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ రైతులకు నేడు మరో శుభవార్త ముఖ్యమంత్రి జగన్ చెప్పనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో నేడు జగన్ విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద, పీఎం కిసాన్ కింద 2,190 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెనాలిలో జరగనున్న ఆయన పర్యటనలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు.
మూడో విడత నిధులు....
నాలుగో సంవత్సరం మూడో విడత నిధులను ఈరోజు జగన్ విడుదల చేయనున్నారు. అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని కూడా నిధులను విడుదల చేయనున్నారు. దీంతో పాటు పంటకు వినియోగించే ఎరువులపై సబ్సిడీలను అందించడంతో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయనున్నారు. జగన్ తెనాలి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10.15 గంటలకు తెనాలి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 12.45 గంటలకు అక్క ినుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
Next Story

