Sun Mar 15 2026 11:53:53 GMT+0530 (India Standard Time)
నేను కోర్టుకు హాజరు కాలేను : జగన్
ఈరోజు ఎన్ఐఏ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మినహాయింపు కోరారు.

ఈరోజు ఎన్ఐఏ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మినహాయింపు కోరారు. కోడి కత్తి కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బాధితులు కూడా హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్న సందేహం మధ్య జగన్ ఈ మినహాయింపును కోరారు.
కోడికత్తి కేసులో...
2018 అక్టోబరులో విశాఖ ఎయిర్పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు కోసం పత్రాన్ని జగన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

